వైఎంసీఏ భూముల లీజులు చెల్లవని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ ( వైఎంసీఏ ) సంస్థకు అధ్యక్షుడుగా ఉన్న ఎంజే డేవిడ్ తన పదవీ కాలం గడువు ముగిసిపోయినా... మేడ్చల్ జిల్లా అషాపూర్లో సంస్థకు చెందిన 16 ఎకరాల 8 గుంటల స్థలాన్ని ఇతరులకు కట్టబెట్టడం నేరమని వారు నారాయణగూడలో ఆరోపించారు. డేవిడ్‌తో పాటు పిలెమన్ రాజ్‌కుమార్, శ్రీకాంత్, జీకే రూథర్స్, బోయాస్ పాల్, వీవీ నోబుల్ ఆరుగురు కలిసి కోట్లాది రూపాయల విలువ చేసే సంస్థ భూమిని ఎకరానికి 2 వేల చొప్పున 47 సంవత్సరాలకు లీజుకు ఒప్పందం చేసుకున్నారన్నారు. ఒప్పందం చేసుకున్న లీజు పత్రాలలో నకిలీ సంతకాలు చేశారన్నారు. పిలెమన్ రాజ్ కుమార్ ఒప్పంద సమయంలో అమెరికాలో ఉన్నాడని.. అతని సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. నకిలీ సంతకాలతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఒప్పంద గడువు తేదీ ముగుస్తున్నందున తక్షణం సికింద్రాబాద్, హైదరాబాద్ వైఎంసీఏలకు ఎన్నికలు జరిపి చర్యలు చేపడతామని వారు స్పష్టం చేశారు.
వైఎంసీఏ భూముల లీజులు చెల్లవు - land
వైఎంసీఏ భూముల లీజులు చెల్లవని హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ వైఎంసీఏలకు ఎన్నికలు జరిపి చర్యలు చేపడతామని వారు స్పష్టం చేశారు.
లీజులు చెల్లవు