ఏపీలోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బి.కొత్తకోటలో మరణించిన తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా... ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో పలువురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైకాపా శ్రేణుల దాడిలో తెదేపా నేతలకు చెందిన 4 కార్లు ధ్వంసమయ్యాయి.
'ఠాణాకు సమీపంలోనే దాడి జరిగినా పట్టించుకోరా..?'
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ దాడిలో... పలువురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. నాయకుల కార్లతో పాటు... జర్నలిస్టుల చరవాణులు, కెమెరాలు కూడా ధ్వంసమయ్యాయి.
'ఠాణాకు సమీపంలోనే దాడి జరిగినా పట్టించుకోరా..?'
రాజంపేట తెదేపా నేత శ్రీనివాసరెడ్డి, పీలేరు తెదేపా నేత కిశోర్‌కుమార్‌రెడ్డి కార్లు ధ్వంసం అయ్యాయి. 'ఈనాడు' ప్రతినిధి చరవాణి, కెమెరాను వైకాపా కార్యకర్తలు లాక్కున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోకి భారీగా తెదేపా, వైకాపా కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. తెదేపా నేతల ఆందోళనతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.