షియోమీ నుంచి స్మార్ట్ షూ - smart shoe
షియోమీ నుంచి త్వరలో స్మార్ట్ షూ అందుబాటులోకి రానుంది.
భారత విపణిలో పోటీని తట్టుకునేందుకు కంపెనీలు సరికొత్త ఉత్పత్తులతో ముందుకొస్తున్నాయి. తాజాగా షియోమీ స్మార్ట్ షూను రూపొందించింది. దీనికి ఎమ్ఐ స్నీకర్స్ 2గా పేరు పెట్టారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రకటించింది.
రెండు వారాల క్రితం షియోమీ రెడ్ మీ నోట్ 7లో 48 ఎంపీ కెమెరాను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం స్మార్ట్ షూతో భారత్ మార్కెట్ని కొల్లగొట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎంఐ టీవీ, ఎంఐ బ్యాండ్స్, ఎంఐ ఎయిర్ మాస్క్, ఎంఐ పెన్, ఎంఐ స్కేల్ వంటి ఉత్పత్తులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
భారత్లో మొట్టమొదటి సారిగా స్మార్ట్ షూని అందించడానికి షియోమీ సిద్ధమయింది. చైనాలో ఇప్పటికే మిజీ స్నీకర్స్గా వీటిని విడుదల చేసింది. ఇప్పుడు అదే షూని ఎంఐ స్నీకర్స్2 పేరుతో ఇండియాలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్నది ప్రకటించలేదు. త్వరలో రెడ్ మీ నోట్ 7తో పాటు విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటెల్ క్యూరీ చిప్ పొందుపరిచిన ఈ షూ వాకింగ్, రన్నింగ్ ఆక్టివిటీని తెలియజేస్తుంది. చైనాలో విడుదల చేసిన మొదటి ఎంఐ స్మార్ట్ షూ ఖరీదు రూ.3,200. భారత్లో స్వల్ప తేడా ఉండొచ్చు.