తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన సదస్సు - యశోదా ఆసుపత్రి యాజమాన్యం అవగాహన సదస్సులు

లంగ్​ పాయింట్​ అనే సరికొత్త వైద్య విధానం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్​కు చికిత్స అందించే ప్రక్రియలపై వైద్య నిపుణులు హైదరాబాద్​ ట్రైడెంట్​ హోటల్​లో జరిగిన సమావేశంలో అవగాహన కల్పించారు. యశోదా ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాల వైద్యులు పాల్గొన్నారు.

ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన

By

Published : May 26, 2019, 5:46 PM IST

ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధరణ... సులువైన వైద్యానికి సంబంధించి హైదరాబాద్​ యశోదా ఆసుపత్రి ఆధ్వర్యంలో హోటల్​ ట్రైడెంట్​లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చైనా, మలేషియా, సింగపూర్​కు చెందిన పలువురు ప్రముఖ పల్మానజిస్ట్​లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో లంగ్​ పాయింట్​ అనే సరికొత్త వైద్య విధానం, ఊపిరితిత్తుల క్యాన్సర్​కు చికిత్స అందించే ప్రక్రియలపై అవగాహన కల్పించారు.

ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన సదస్సు

ప్రాథమిక దశలో గుర్తిస్తే సులభమే

ఊపిరితిత్తుల క్యాన్సర్​ని ప్రాథమిక దశలో గుర్తిస్తే సమస్య పరిష్కరించడం అత్యంత సులభమని యశోదా ఆస్పత్రి ఎండీ జీఎస్​రావు అన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ వైద్య నిపుణులు వర్క్​షాప్​లో పాల్గొన్నారని తెలిపారు. ఈ వైద్య విధానం వల్ల లంగ్​కు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details