తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఇచ్చిన ఘనత తెరాసదే'

హైదరాబాద్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఇంటర్నేషనల్‌ ఆర్య వైశ్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

women's day celebrations
హైదరాబాద్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

By

Published : Mar 8, 2021, 4:29 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ ఆధ్యర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, పర్యాటక అభివృద్ధి శాఖ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు మహిళలను మంత్రి సత్కరించారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తోందని మంత్రి సబిత పేర్కొన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, వితంతువు పింఛను తదితర సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మహిళలను మేయర్, డిప్యూటీ మేయర్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని వెల్లడించారు. ఈ నెల 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సబిత కోరారు.


ఇదీ చదవండి:చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి: తలసాని

ABOUT THE AUTHOR

...view details