సంప్రదాయంతోపాటు సాహసం...! అబల అంటే ఆది పరాశక్తి అని...మహిళలు అనుకుంటే సాధించలేనిదేదీ ఉండదంటున్నారు బైకర్నీ సభ్యులు. హైదరాబాద్లో 2013లో ఇద్దరితో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం గేర్ బైక్ నడిపే మహిళలే సభ్యులుగా ఉంటారు. 2019లో50 మంది సభ్యులకు చేరుకుని ఆరు వసంతాలు పూర్తి చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని నడపటం సరదాగా తీసుకోకుండా తాము బైకుపై వెళ్లే ప్రతిచోట ఏదో ఓ అంశంపై ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
సంప్రదాయ పరిరక్షణకై....
తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ వస్త్రాలను పరిరక్షించాలనుకుని చేనేత వస్త్రాలు ధరించి బైకులపై 1200కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు.చేనేత కుటుంబాలు పడుతున్న కష్టాలను వివరించారు.
భయాన్ని వీడాలి...
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా..స్వేచ్ఛగా విహరించాలన్నది ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. గేర్ వేసేటప్పుడే భయం ఉంటుంది. ఒక్కసారి గేర్ వేస్తే..భయం మాయమవుతుందని మహిళలకు భరోసానిస్తున్నారు.
షీటీమ్స్ అండతో...
మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు తమవంతు ప్రచారం నిర్వహిస్తున్నామని.. ఈ విషయంలో షీటీమ్స్ తమకు అండగా నిలుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలన్నదే తమ లక్ష్యమంటున్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు...
మహిళా సభ్యులు ఇప్పటి వరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బైకులపై చుట్టొచ్చారు. భారత్తో పాటుఆసియా దేశాలను ద్విచక్రవాహనాలపైనే పర్యటించారు. సంస్థతో ప్రయాణం తమకు జ్ఞాపకాల్ని, అనుభూతుల్ని, పాఠాలను నేర్పిస్తోందని బైకర్నీ సభ్యులు చెప్పుకొచ్చారు.
ఇవీ చూడండి:రైలు కాదు ఇది... చదువుల బడి