తెలంగాణ

telangana

ETV Bharat / state

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య - వివాహిత ఆత్మహత్య

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం వరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత భర్త ఆమెను వరకట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. చివరకు భర్త వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్తే ఆమెను హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

By

Published : Jul 14, 2019, 10:31 PM IST

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్​ పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

ప్రేమ వివాహం

నల్గొండ జిల్లా కాశరాజుపల్లికి చెందిన నరేష్​ రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కూభ్యతండాకు చెందిన జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం కూకట్​పల్లి సంగీతనగర్​లో నివాసముంటున్నాడు. నరేష్​ డ్రైవరుగా పనిచేస్తుండగా... జ్యోతి డీమార్టులో విధులు నిర్వహింస్తోంది. నరేష్​ సంవత్సరం వరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడని జ్యోతి బంధువులు తెలిపారు. భర్తే ఆమెను హత్య చేసి పరారయ్యాడని ఆరోపిస్తున్నారు. జ్యోతి ఆత్మహత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదులు తెలిపారు.

ఇదీ చూడండి : బోయిన్​పల్లిలో బాలిక ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details