తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థిక సమస్యలతో బ్యుటీషియన్​ ఆత్మహత్య - ఆర్థిక సమస్యలతో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్​లోని కేపీహెచ్​బీ పీఎస్​ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆర్థిక సమస్యలతో బ్యుటీషియన్​ ఆత్మహత్య

By

Published : Jul 23, 2019, 9:04 PM IST

ఆర్థిక సమస్యలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​లోని కేపీహెచ్​బీ పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్​బీలోని ఓ కాలనీలో గోపాల్ కృష్ణ, శిరీష దంపతులు నివసిస్తునారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దోమురు గ్రామానికి చెందిన వీరు నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. గోపాల్ కృష్ణ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, శిరీష బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు గోపాల కృష్ణ ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఆర్థిక సమస్యలతో బ్యుటీషియన్​ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details