తెలంగాణ

telangana

ETV Bharat / state

బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం - WOMEN SUICIDE NEWS

భార్య... భర్తను ఏదైన కొనివ్వమనడం కామన్​. ఒకవేళ నచ్చింది తీసుకురాకపోతే అలగడమూ సహజమే. కానీ ఓ మహిళ భర్త బిర్యానీ తీసుకురాలేదని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాధ ఘటన హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

WOMEN SUICIDE ATTEMPT FOR BIRYANI IN HYDERABAD
బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం

By

Published : Feb 7, 2020, 2:16 PM IST

హైదరాబాద్​ రహ్మత్​నగర్​లో నివసించే వెంకటయ్య ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మూడు రోజులుగా అతని భార్య పద్మ(28) చికెన్​ బిర్యానీ తీసుకురావాలని భర్తను కోరింది. తన మాటను పెడచెవిన పెడుతున్నాడని భావించిన పద్మ... బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకుంది.

చుట్టుపక్కలవారు గమనించి ‘108’ ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శరీరానికి దాదాపు 70 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలియజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:వారితో వేడుక చేసుకున్న ట్రంప్!

ABOUT THE AUTHOR

...view details