హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళ తనపై ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులను ఆశ్రయించింది. డిసెంబర్ 28న తన రూమ్ వద్దకు ఇద్దరు తెలిసిన వ్యక్తులు వచ్చారని పేర్కొంది. లోపలికి వచ్చాక వారిని చూస్తే గంజాయి సేవించారని తెలిసిందని బాధితురాలు తెలిపింది.
సదురు వ్యక్తులు తనకు మద్యం తాగించి అత్యాచారానికి ఒడిగట్టారని.. మరో వ్యక్తి వీడియో తీశాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. అదేరోజు రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా.. జనవరి7 దాకా కేసు నమోదు చేయలేదని వాపోయింది.