వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. రామ్‌నగర్‌లో హారతి అనే యువతిని ఆమె ప్రియుడు షాహిద్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. కాజీపేటకు చెందిన షాహిద్ రామ్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. లష్కర్ సింగారానికి చెందిన హారతి అనే యువతి అతని గదికి రాగా ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. మాటమాట పెరిగి గొంతు కోసి పారిపోయాడు. ఘటనా స్థలిని పోలీస్ కమిషనర్ రవీందర్ పరిశీలించారు.
నిందితుడు షాహిద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ప్రేమ వ్యవహరమే కారణమని తెలిపారు. నిందితుడు ఓ మటన్ షాపులో పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఘటనా స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ పరిశీలించారు. యువతి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.