ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులను చవిచూస్తోందని.. పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాల డిమాండ్లను సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రి పువ్వాడ అజయ్‌ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమ్మెలు చేయడం సంస్థకు క్షేమం కాదని కార్మిక సంఘాలకు సూచించారు. ఆర్టీఏలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకొస్తానంటున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఆర్టీసీ నష్టాలకు త్వరలోనే పరిష్కారం: పువ్వాడ - మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో ఉందని.. పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తానని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
ఆర్టీసీ సమస్యలను తీర్చేందుకు కృషి : పువ్వాడ అజయ్