హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని నూరినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తింటివారి వేధింపులు తాళలేక ఓ గృహిని అమ్మగారి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 5 నెలల పాప ఉన్న రహ్మత్ ఉన్నిసాకు ఏడాది క్రితం షాబాజ్‌తో వివాహం జరిగింది. గత కొన్ని నెలలుగా భర్త, అత్త వేధిస్తూ కడుపుతో ఉన్న ఉన్నిసాను పుట్టింటికి పంపించారు.
పుట్టింట్లో ఉన్నిసా ఓ పాపకు జన్మనిచ్చింది. రెండు రోజుల కిందట అత్తింటివారు వచ్చి శిశువును చూశారు. భర్త మాత్రం మాట్లాడకుండా వెళ్లిపోయాడనే మనస్తాపంతో రహ్మత్ బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి సోదరి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భర్త మాట్లాడలేదని భార్య ఆత్మహత్య - భార్య
హైదరాబాద్‌లో అత్తింటివారి వేధింపులతో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. పుట్టింట్లో ఓ పాపకు జన్మనిచ్చిన రహ్మత్ ఉన్నిసా.. భర్త తనతో మాట్లాడలేదని మనస్తాపానికి గురైందని మృతురాలి సోదరి తెలిపింది.
భర్త మాట్లాడలేదని భార్య ఆత్మహత్య