కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ముందు ఓ వివాహిత ధర్నాకు దిగింది. అత్తా మామ, మరిది ప్రోద్బలంతోనే తనను పుట్టింటికి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టింది. ఈ ఘటన హైదరాబాద్ సరూర్‌నగర్ శ్రీ సాయికృష్ణనగర్‌లో చోటుచేసుకుంది. రిటైర్డ్ విద్యుత్ ఏఈ బురం దశరథం కుమారుడు సంతోశ్కుమార్కి నాగర్‌కర్నూల్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ గజ్జల శేఖర్ కుమార్తె మౌనికతో 2017 మే 10 న వివాహం జరిగింది.
'నన్ను, నా కొడుకుని పుట్టింటికి పంపాడు.. విడాకులంటున్నాడు' - hyderabad news in telugu
తనను కాపురానికి తీసుకెళ్లటంలేదని ఓ మహిళ భర్త ఇంటి ముందు దీక్షకు దిగింది. పోలీసులు మందలించినా... మారలేదని ఆరోపించింది. ఈ ఘటన హైదరాబాద్ సరూర్‌నగర్ శ్రీసాయికృష్టనగర్లో చోటుచేసుకుంది.
గోవాలోని ఓ రెస్టారెంట్లో పనిచేసిన సంతోశ్‌కుమార్... కొంతకాలం తర్వాత మానేసి నగరానికి వచ్చాడు. సంతోశ్ దంపతులకు ఒక కొడుకున్నాడు. కాగా... మౌనికను, కొడుకును పుట్టింటికి పంపించేసి... విడాకులు కావాలని నోటీసులు పంపారు. ఈ క్రమంలో నాగర్‌ర్నూల్ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేదు. పోలీసులు మందలించినా... తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని సంతోశ్ ఇంటి ముందు దీక్షకు దిగింది. పోలీసులు ఇంటి వద్దకు వచ్చి విచారిస్తున్నారు. మౌనిక తల్లిదండ్రులు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.