హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్‌లో సలీం, తహరా బేగం అనే దంపతులు నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య తరచు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ రోజు ఉదయం కూడా వారి మధ్య ఎప్పుడూ జరిగినట్టుగానే చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. గొడవతో ఆగ్రహానికి గురైన సలీం భార్యను హతమార్చి హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య ప్రాణం తీసిన గొడవ
భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ భార్య ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్‌లో చోటుచేసుకుంది.
భార్య ప్రాణం తీసిన గొడవ