జీతాలు ఎప్పుడిస్తారు..? - salaries
ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారని ఒకటో తేదీనే జీతాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎన్.ఎం.యూ అధ్యక్షుడు కమలారెడ్డి డిమాండ్ చేశారు.
kamalareddy
తెలంగాణ ఆర్టీసీ సంస్థ సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేవారని, గత సంవత్సరం నుంచి జాప్యం అవుతోందని ఎన్.ఎం.యూ అధ్యక్షుడు కమలారెడ్డి ఆరోపించారు. ప్రతి నెలా 28 నాటికే పేస్లిప్లు తయారుచేసి వెంటనే వాటిపై ఆడిట్ నిర్వహించి జీతాలు వేస్తారని తెలిపారు. ఇప్పటి వరకు వేతన రశీదులే తయారు కాలేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
kamalareddy
Last Updated : Feb 2, 2019, 8:21 AM IST