తెలంగాణ

telangana

ETV Bharat / state

Summer Games: వేసవి సెలవుల్లో ఏం చేయాలి..?

Summer holidays: వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలను ఈ సెలవు రోజులు ఉన్నంత కాలం ఎలా భరించాలి రా బాబూ అనుకుంటున్నారా? సెలవులు వచ్చాయిగా వారు ఏ సబ్జెక్టులో నాలెడ్జ్ తక్కవగా ఉందో అందులో కోచింగ్​ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? ఇంట్లో వాళ్లకి ఫోన్​ ఇస్తే వాళ్లే కూర్చోని సైలంట్​గా ఉంటారు అని భావిస్తున్నరా? మీరు ఆలోచించింది మంచిదే అయినా మీ పిల్లలకు చెడు జరిగే ప్రమాదం ఉంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా కొన్ని ఆటలు ఆడుకోవాలి. అప్పుడే మానసికంగా వృద్ధి చెంది.. పెద్ద వారు అయ్యాక వచ్చే సమస్యలను అధిగమించగలరు.

By

Published : Apr 15, 2023, 10:35 PM IST

Summer Games
సమ్మర్​ గేమ్స్

Summer holidays: వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకి ఎక్కడ లేని ఆనందం ఒక్కసారిగా వచ్చేస్తుంది. అలా ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు సెలవు వచ్చిందంటే ఆ వయస్సులో ఉన్న పిల్లలు అందరూ ఒక చోట చేరి వారికి నచ్చిన ఆట ఆడుకునే వారు. ఆ ఆటలో వారికి తిండి, నిద్ర, సమయం.. అసలు ఏమి తెలియవు. పైగా వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోడానికి తల్లిదండ్రులు పడే ఇబ్బందులు భలే ఉండేవి కదూ..! ప్రస్తుత రోజుల్లో అసలు పిల్లలకి సెలవు వచ్చిన ఒకటే రాకపోయిన ఒకటే. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉంటున్నాయి. సెలవు వచ్చిన రోజుకి రాని రోజుకి తేడా ఎంటంటే ఫోన్​ వాడే సమయం కాస్త తగ్గుతుంది అంతే..!

Summer Games: చదువుకునే పిల్లలు మాససికంగా, శారీరకంగా తొందరగా ఎదగాలంటే.. పాఠశాల్లో నేర్చుకునే చదువుతో పాటు స్కూల్ బయట ఆడుకునే ఆటలు అంతే ముఖ్యం అని పెద్దలు చెబుతుంటారు. ఈ రోజుల్లో విద్యార్థి బయట ఆడుకోవడం నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో పిల్లలు బయట ఆడుకోడానికి వెళ్లమని చెబితే.. అక్కడికి వెళ్లి ఎలాంటి గేమ్స్ ఆడుకోవాలి అనే పరిస్థితి వస్తుంది. అసలు చిన్నతనంలో పిల్లలు ఆడుకునే ఆటలకు చాలా ప్రాధాన్యత ఉంది. వాటి ద్వారానే వారి పరిపక్వత వృద్ధి చెందుతుంది. వారు వేసవి సెలవుల్లో ఆడుకొనే ఆటలు గురించి తెలుసుకుందాం..!

గోళీలాట:చిన్న పిల్లలు ఎక్కువుగా ఇష్టపడే ఆటల్లో ఒకటి గోళీల ఆట. చుట్టు పక్కల ఉన్న వారందరూ చేరి వారి దగ్గర ఉన్న గోళీలను ఒక సర్కిల్​లో పెట్టి గేమ్​ ఆడుకొంటారు. ఈ ఆటలో గెలిచిన వారు ఆ గోళీలను తీసుకుంటారు. ఈ ఆటలో పైన ఉన్న సూర్యుడు నుంచి వచ్చే ఎండ సైతం లెక్కచేయకుండా వారు ఈ ఆటలో నిమగ్నమైపోతారు. ఈ ఆట ఆడటం వల్ల పక్క వ్యక్తులతో ఎలా ఉండాలో తెలుకుంటారు. వారికి అందరితో కలిసిపోయే అలవాటు ఏర్పడుతుంది.

గోళీలాట్

కర్రా బిల్లా:ఈ ఆటను ఎక్కువుగా రెండు గ్రూప్​లుగా విడిపోయి ఆడుతుంటారు. దీనివల్ల నాయకత్వ లక్షణాలు అలవడుతాయి. కర్రతో బిల్లను కొట్టి వెళ్లిన దూరాన్ని కొలుస్తారు. ఎవరు ఎక్కువ దూరం కొడతారో వారు గెలుచినట్టు. శారీరకంగా ఎక్కువగా ఆడుకోవడం వల్ల సాయంత్రానికి ఇంటికి వచ్చి వారే తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా వారి పనులు చేసుకుంటారు. తాత, నానమ్మలతో సంతోషంగా గడుపుతారు. వారు ఆ రోజు ఆడిన ఆటలు గురించి చెబుతారు. దీనివల్ల వారికి భాషాభివృద్ధి వేగంగా జరుగుతుంది.

కర్రా బిల్లా

అమ్మమ్మతో కథలు.. తాతయ్యతో ఆటలు: వేసవి సెలవుల్లో చిన్నపిల్లలు ఎక్కువగా బంధువుల ఇంటికి వెళ్తుంటారు. వారి తాతయ్య, అమ్మమ్మ దగ్గరికి వెళ్లడానికి ఎంతో ఇష్టపడతారు. తాతయ్యతో సరదాగా చిందులు వేస్తూ.. వారు నేర్చుకున్న డాన్స్ చేసి సంతోషిస్తారు. పెద్దవారు రాత్రి సమయాల్లో బయట పడుకునే పిల్లలకు చెప్పే కథల్లో ఎంతో ప్రేమ దాగి ఉంది. ఒక్కోసారి పైనుంచి చూస్తున్న చందమామే నాకు అలా ప్రేమగా చేప్పే తాతయ్య, అమ్మమ్మ లేరని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ కథల్లో నీతి, ఆశక్తి అంత బాగుంటుంది. వాటిలో బాగా ప్రాముఖ్యమైనది మనందరికి తెలిసింది ఏడు చేపల కథ.

మరి ఇలాంటి స్టోరీలు ప్రస్తుత పిల్లలకి చెప్పేవారే కరవైపోయారు. చెప్పే వారు ఉన్న వినే పిల్లలు తక్కువైపోయారు. ఆ కథల్లో మన భారత సంస్కృతి దాగి ఉంది. ఓ సారి మీ పిల్లలకి మీరు చిన్నప్పుడు నేర్చుకున్న, విన్న కథలను వారికి ఈ సెలవుల్లో చెప్పి చూడండి వారిలో ఎంతో మార్పు కనబడుతుందో గమనించగల్గుతారు. దాంతో పాటు మీ పై ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది.

ఈ వేసవి సెలవులకి ప్రతి సంవత్సరం ఆలోచించినట్టే కాకుండా కొంచెం భిన్నంగా ఆలోచించి పిల్లలను ఆడుకొనేందుకు కాస్త సమయం ఇవ్వండి. వీలైతే మీరు కూడా వారితో ఆడుకోండి. ఎందుకంటే పిల్లలను మించిన సంపద ఈ లోకంలో ఏమి లేదుకదా..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details