కరోనా పూర్తిగా అంతం కావాలని పశ్చిమబంగాకు చెందిన అద్దంకి రవి పాదయాత్ర చేపట్టారు. పశ్చిమబంగా ఖరగ్పూర్ నుంచి తిరుపతికి ఈ నెల 10వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై లొద్దపూట్టి కూడలి వద్ద స్థానికులు అద్దంకి రవికి స్వాగతం పలికారు.
కరోనా: పశ్చిమబంగా నుంచి తిరుపతికి పాదయాత్ర - ఏపీ వార్తలు
కరోనా అంతం కావాలని పశ్చిమబంగా ఖరగ్పూర్ నుంచి తిరుపతికి ఓ వ్యక్తి పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 10న ప్రారంభమైన ఆయన పాదయాత్ర శనివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చేరింది.
కరోనా: పశ్చిమబంగా నుంచి తిరుపతికి పాదయాత్ర
కరోనా వైరస్ అంతమై, దేశానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి :గతంలో కంటే నాలుగు స్థానాలు అధికంగా వస్తాయి: కేసీఆర్