కరోనా వైరస్ కట్టడికి ఎనిమిది వారాల నుంచి నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు వారాంతపు సెలవు ఇవ్వాలని కొత్వాల్ అంజనీకుమార్ నగరంలోని ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. మార్చి రెండో వారం నుంచి ఇప్పటి వరకు ప్రతి పోలీస్ ఠాణాలో కానిస్టేబుళ్లు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. ప్రతి కానిస్టేబుల్‌కు వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలని, అది రొటేషన్ పద్ధతిలో ఉండేలా చూడాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎనిమిది వేల మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు
కానిస్టేబుళ్లకు వారాంతపు సెలవు - ts police
కానిస్టేబుళ్లకు వారంతపు సెలవు ఇవ్వాలని కొత్వాల్ అంజనీకుమార్ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. అది రొటేషన్ పద్ధతిలో ఉండేలా చూడాలని సూచించారు.
కానిస్టేబుళ్లకు వారాంతపు సెలవు