తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులు బీ అలర్ట్..
రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులు బీ అలర్ట్..
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. ఇది వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఒరిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దీనికి అనుబంధముగా 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని సూచించారు. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని పేర్కొన్నారు.
దక్షిణ ఒరిశా, దాని పరిసర ప్రాంతాలలో 7.6 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ సంచాలకులు వివరించారు.
- ఇదీ చూడండి: ఏకధాటి వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం