ఈ నెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5రోజులు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 12,13తేదీల్లో కొన్ని ప్రదేశాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
RAINS: అల్పపీడన ప్రభావంతో రాగల 5రోజులు విస్తారంగా వర్షాలు
రాష్ట్రంలో రుతుపవన ప్రభావం మొదలైంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది.
రాగల 5రోజులు విస్తారంగా వర్షాలు
ఉపరితల ద్రోణి ఈరోజు దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా గుజరాత్ వరకు సముద్రమట్టానికి 3.1కిమీ నుంచి 5.8కిమీ వరకు వ్యాపించి ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా నేటి నుంచి మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు.
ఇదీ చదవండి: టీకా ధ్రువపత్రంలో తప్పులా? సరి చేసుకోండిలా..