రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి విధుల్లో చేరిన 31 మంది పోలీసులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సత్కరించారు. కొవిడ్ వ్యాధి సోకిన ప్రతి సిబ్బందికి సీపీ మహేష్ భగవత్ స్వయంగా ఫోన్ చేసి తమ బాగోగులను తెలుసుకున్నారని.. తమకి ధైర్యం చెప్పిన మాటల వల్లే తొందరగా కొలుకున్నామని పలువురు సిబ్బంది అన్నారు. వారి అనుభవాలను మిగతా వారికి తెలిపామని పేర్కొన్నారు.
'సీపీ ధైర్యం చెప్పడం వల్లే తొందరగా కోలుకున్నాం' - కరోనా నుంచి కోలుకున్న 31 మంది పోలీసులు
కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరిన 31 మంది పోలీసులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సత్కరించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కరోనా వ్యాధి సోకిన వారికి సీపీ స్వయంగా ఫోన్ చేసి బాగోగులు తెలుసుకున్నారని పలువురు సిబ్బంది అన్నారు. సీపీ తమకు ధైర్యం చెప్పడం వల్లే తొందరగా కోలుకున్నామని చెప్పారు.
'సీపీ ధైర్యం చెప్పడం వల్లే తొందరగా కోలుకున్నాం'
విధులు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు. రానున్న కాలంలో కరోనాతో కలిసి జీవించాలన్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాస సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పారు. కరోనా వైరస్ నుంచి బయటపడిన వారు కరోనా వచ్చిన వారికి ప్లాస్మా దానం చేయాలని సూచించారు.
ఇదీ చూడండి :'ఆ సిబ్బందికి 50 లక్షల నష్ట పరిహారం అందించాలి'