తెలంగాణ

telangana

ETV Bharat / state

లీకేజీ వ్యవహారంతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ - sachivalayam

సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రం లీకైనట్లు వచ్చిన ఆరోపణలు, ఆ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ అంతా ప్రభుత్వ శాఖలే నిర్వహించాయని వెల్లడించారు. ఈ విషయంపై స్పందించాల్సింది పంచాయతీరాజ్ శాఖే అని స్పష్టం చేశారు.

లీకేజీ వ్యవహారంతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ

By

Published : Sep 23, 2019, 11:48 PM IST

లీకేజీ వ్యవహారంతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు సబంధించి పేపర్ లీక్ వ్యవహరంలో తమకు ఏ మాత్రం సంబంధం లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్​లోని గ్రామ సచివాలయ ఉద్యోగాలను పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ప్రభుత్వం నిర్వహించిందని తమ ప్రమేయం ఏమాత్రం లేదని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఆరోపణలపై ప్రభుత్వమే విచారణ జరిపించాలన్నారు. ఏపీపీఎస్సీలో ప్రశ్నాపత్రం లీక్ అయిందని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కమిషన్ సమావేశం నిర్వహించింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి మౌర్య, సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో తమపై వచ్చిన ఆరోపనలపై సుదీర్ఘంగా చర్చించారు. లీకేజీ వ్యవహారంపై పరీక్షను నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ విచారణ చేయాల్సి ఉందన్నారు. పరీక్ష నిర్వహణలో తమ పాత్ర ఎక్కడా లేదని సాయం కోసం పంచాయతీ రాజ్ శాఖకు ఓ అధికారిని అప్పగించామని వారిని పంచాయతీ రాజ్ శాఖనే పర్యవేక్షించిందన్నారు. పరీక్ష పత్రాల రూపకల్పన సహా ముద్రణకు సంబంధించి గోప్యంగా జరపాల్సిన వ్యవహారాలను పంచాయతీ రాజ్ శాఖే నిర్వహించిందని తమకు సంబంధం లేదని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details