Drink Water Supply in Hyderabad: ఈ నెల 27న హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి వెల్లడించింది. నగరంలోని లింగంపల్లి నుంచి బోరబండ వరకు ఉన్న 800 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్ స్థానంలో.. కొత్తగా 800 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ వేయాలని జలమండలి నిర్ణయించింది.
భాగ్యనగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా అంతరాయం.. ఎప్పుడంటే? - హైదరాబాద్ నీటి సరఫరా
Drink Water Supply in Hyderabad: లింగంపల్లి నుంచి బోరబండ వరకు ఉన్న తాగు నీటి పైపులైన్ స్థానంలో మరో పైపులైన్ వేసేందుకు జలమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. ఈ నెల 27న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనున్నట్లు జలమండలి వెల్లడించింది.
ఈ పనుల నేపథ్యంలో ఈనెల 27వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 28 తేదీ ఉదయం 6 గంటల వరకు.. మొత్తం 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని స్పష్టం చేసింది. బోరబండ రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి వెల్లడించింది. దీంతో పాటు 28వ తేదీ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నీటి సరఫరా జరుగుతుందని తెలిపింది. బోరబండ, అల్లాపూర్, గాయత్రినగర్, పర్వత్‌నగర్, వివేకానందనగర్, ఎస్పీఆర్ హిల్స్, శ్రీరామ్‌నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొంది.
ఇదీ చూడండి: