తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహానగరంలో నీటి సమస్య రానివ్వం...!'

అసలే ఎండాకాలం... మహా నగరంలో మంచినీటి సమస్యలకు కొదవేం లేదు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జలమండలి చర్యలు చేపట్టింది. గ్రేటర్​లో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కసరత్తు చేయనున్నారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో నూతనంగా ఫిల్లింగ్​ స్టేషన్లు ఏర్పాటుచేయనున్నారు. అవసరమైతే అదనపు ట్యాంకర్లను ఏర్పాటు చేయనుంది వాటర్​బోర్డు.

మహానగరంలో నీటి సమస్యలకు జలమండలి చెక్​..!

By

Published : May 25, 2019, 3:37 PM IST

భాగ్యనగరంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ దానకిషోర్​ స్పష్టం చేశారు. హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవిలో మంచినీటి సరఫరాపై.. సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మహానగరంలో నీటి సమస్యలకు జలమండలి చెక్​..!

పెరిగిన నీటి సరఫరా...

గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువగా నీటి ట్యాంకర్లు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. నీటి అవసరం ఎక్కువగా ఉన్న 20 చోట్ల వెంటనే నూతన ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే అదనంగా 130 ట్యాంకర్లను అద్దె ప్రతిపాదికన ఏర్పాటు చేయనున్నారు. గతేడాది రోజుకు 1800 నుంచి 2వేల ట్రిప్పులు సరఫరా చేస్తే.. ప్రస్తుతం 3 వేల నుంచి 3వేల 600 ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

కలుషిత నీరు రాకుండా చర్యలు...

మంచినీటి సరఫరాలో కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఎండీ ఆదేశించారు. జీఎం, మేనేజర్, లైన్​మెన్, మంచినీటి సరఫరా సమయంలో క్షేత్రస్థాయిలతో పర్యటించి నీటిని వృథాగా రోడ్డుపై వదులుతున్న వారిని గుర్తించాలని.. వారికి నీటి వృథాపై అవగాహన కల్పించాలని చెప్పారు. వాణిజ్య ట్యాంకర్ల ట్రిప్పులను కుదించి నీటిని సరఫరా చేయాలని సూచించారు.

కొన్ని చోట్ల నీళ్లు అందక ప్రజల ఇక్కట్లు...

జలమండలి ఇలా చెబుతున్నప్పటికీ గ్రేటర్​ పరిధిలో చాలా చోట్ల నీరురాక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లో మాత్రం ఈ బాధవర్ణణాతీతంగా ఉందని వాపోతున్నారు. పట్టణ నడిబొడ్డున కూడా ట్యాంకర్​ బుక్​ చేసి రోజులు గడిచినా రావడం లేదని... ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇననైన తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: పాలమూరులో అడుగంటిన భూగర్భజలాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details