ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న వాచ్మెన్ అదే బడిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ హుమాయున్ నగర్ ఠాణా పరిధిలోని విజయనగర్ కాలనీలో చోటు చేసుకుంది. వాచ్‌మెన్‌గా పనిచేసే శ్రీనివాస్ (32) పాఠశాల ఆఫీస్ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీనివాస్ అక్క.... తన తమ్ముని విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరైంది. ఉదయం స్కూల్ యాజమాన్యం గమనించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తిగత సమస్యలతో వాచ్మెన్ ఉరివేసుకొని ఆత్మహత్య - Watchmen
ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న వాచ్మెన్ అదే బడిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని హుమాయున్ నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
hanged