తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటర్ల లెక్క తేలింది - male

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య రెండు కోట్ల 95లక్షలకు పైగా నమోదైంది. ఇందుకు అనుగుణంగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు.

తుది జాబితా

By

Published : Feb 22, 2019, 8:46 PM IST

తుది జాబితా
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు కోట్ల 95 లక్షల 18వేల 964. ఇందులో పురుషులు కోటి 48 లక్షల 42వేల 619. మహిళల సంఖ్య కోటి 46 లక్షల 74వేల 977. ఇతరులు 1,368 మంది ఉన్నారు. ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారి సంఖ్య 5 లక్షల 99వేల 933. నాలుగు లక్షల 69వేల 30 మంది దివ్యాంగ ఓటర్లు, 1,122 మంది ప్రవాస ఓటర్లతో పాటు 10వేల 307 మంది సర్వీసు ఓటర్లు జాబితాలో ఉన్నారు.తాజా సవరణ ముఖ్యాంశాలుసవరణ ప్రక్రియలో మొత్తం 26 లక్షల 23వేల దరఖాస్తుల్లో 2లక్షల 45వేలు తిరస్కరించారు. 44వేల 721 మంది మృతుల, లక్షా 95వేల 369 డూప్లికేట్ ఓట్లను తొలగించారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్లు, జనాభా నిష్పత్తి 738 నుంచి 762కు పెరిగింది. ఓటర్లలో లింగనిష్పత్తి కూడా 982 నుంచి 989కి పెరిగింది.62 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. శేరి లింగంపల్లి ఆరు లక్షల ఓటర్లతో రికార్డు సృష్టించింది.

మహిళా ఓటర్లే అధికం
రాష్ట్రంలో సగానికి పైగా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా ఆరు లక్షల ఐదు వేల 606మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో కేవలం లక్షా 45 వేల 44 మంది ఓటర్లున్నారు. జిల్లాల వారీగా చూస్తే ఎక్కువ ఓటర్లు హైదరాబాద్ లో ఉండగా... తక్కువ సంఖ్యలో ఓటర్లు వనపర్తి జిల్లాలో ఉన్నారు.
ఇదీ చదవండిహడలెత్తించిన రైలింజిన్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details