రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందనే భయంతోనే తాము తలపెట్టిన ర్యాలీకి సీఎం కేసీఆర్ అనుమతివ్వలేదని ఆపార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకించిన కేసీఆర్, తామ శాంతియుత ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు.
'నిజామాబాద్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన' - నిజామాబాద్లో మజ్లిస్ పార్టీ బహిరంగ సభకు ఎలా అనుమతి ఇచ్చారని
తెలంగాణలోని నిజామాబాద్లో మజ్లిస్ పార్టీ బహిరంగ సభకు ఎలా అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. అక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందన్నారు. ఈ అంశంపై త్వరలో ఎన్నికల అధికారిని కలుస్తామన్నారు.
'నిజామాబాద్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన'
నిజామాబాద్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందన్నారు. మజ్లిస్ పార్టీ బహిరంగ సభకు ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఎలా అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. పౌరసత్వ బిల్లుపై కేసీఆర్ కేంద్రంలో ఒక వైఖరి, రాష్ట్రంలో మరొక వైఖరిని వహిస్తున్న తీరును ప్రజలకు వివరిస్తామని వీ.హెచ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : ఇప్పటికే 12 మంది సీఎంలు వ్యతిరేకించారు: సీతారాం ఏచూరి