తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి'

ఖనిజ పరిశ్రమలు కరోనా విపత్కర పరిస్థితులను ప్రగతికి అనుకూలంగా మలుచుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్​ అన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లుకు సూచించారు.

vinod kumar in valedictory function one day webinar on impact of covid-19 on mineral industries
ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు కావాలి

By

Published : Jun 13, 2020, 11:41 PM IST

కరోనా నేపథ్యంలో ఖనిజ పరిశ్రమలు ప్రగతి వైపు పరుగులు పెట్టేలా ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లకు సూచించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఖనిజ పరిశ్రమలపై కోవిడ్ -19 ప్రభావం' అంశంపై వినోద్ కుమార్ వెబినార్​లో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, సింగరేణి జీఎం కె.రవిశంకర్, దేశవ్యాప్తంగా ఇంజినీర్లు పాల్గొన్నారు.

జాతీయ మినరల్‌ ఎక్స్‌ ప్లోరేషన్‌ ట్రస్టు కొత్త ప్రాజెక్టు, డీఎంఎఫ్​టీ నిధుల వినియోగం, బొగ్గు గనుల వేలం, వాణిజ్య మైనింగ్, మైనింగ్ యంత్రాల తయారీ, ఆధునిక మైనింగ్‌ పద్ధతుల కోసం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇవ్వడంపై చర్చించారు. జాతీయ స్థాయిలోని సింఫర్, ఎన్ఐఆర్ఎం వంటి సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు వంటి అంశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు.

ఇదీ చూడండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

ABOUT THE AUTHOR

...view details