తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలకులు పట్టించుకోలేదు.. శ్రమదానంతో రోడ్డు నిర్మించుకున్న గ్రామస్థులు

ఆ గ్రామస్థులు తమ ఊరికి రహదారి కావాలని పాలకులకు విన్నవించి విసిగిపోయారు. పాలకులకు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. అయినా ఫలితం లేకపోవటంతో అంతా ఏకమై రోడ్డును నిర్మించుకున్నారు ఏపీలోని అనకాపల్లి జిల్లా నేరేడుబంధవాసులు.

villagers
villagers

By

Published : Jan 8, 2023, 8:07 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు శివారు నేరేడుబంధ గిరిజన గ్రామంలో సుమారు 70 మంది జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి పిల్లలంతా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్.జోగింపేట పాఠశాలకు నడిచి వెళ్లి వస్తుంటారు. రోడ్డు లేక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు కావాలని నాయకులు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదు.

దీంతో అందరూ చేయిచేయి కలిపి రోడ్డు వేసుకోవాలని నిర్ణయించారు. అంతే రంగంలోకి దిగి సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు రాళ్లు, పొదలను శ్రమదానం పేరుతో తొలగించి రోడ్డు వేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. ప్రయోజనం లేకపోవటంతో శ్రమదానం పేరుతో రోడ్డును నిర్మించుకున్నామని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details