హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ.. మే మొదటి వారంలోనే ప్రారంభమవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రహదారిని ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చే అంశంపై.. విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి కోమటిరెడ్డి ఇవాళ.. దిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భేటీకి జీఎంఆర్ ప్రతినిధులను కేంద్రమంత్రి పిలిచారు. రహదారి విస్తరణలో గుత్తేదారుల సమస్య, డిజైనింగ్‌లో సాంకేతిక లోపాలపై ఎంపీలు కేంద్రమంత్రికి వివరించారు.
సుమారు గంట పాటు జరిగిన ఈ చర్చలో హైదరాబాద్-విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే నెలలోనే పనులు ప్రారంభించాలని జీఎంఆర్ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు పలు అంశాలను ఎంపీ కోమటిరెడ్డి చర్చించారు. నెలలోగా సమస్యలన్నీ పరిష్కరించి.. మేలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని.. కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీలతో పాటు కేంద్ర రవాణా, రహదారుల సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్, ట్రాన్స్పోర్ట్ సెక్రెటరీ, ఎన్హెచ్ఐ అధికారులు పాల్గొన్నారు.
హైవేలో ఉండాల్సిన డిజైన్ లేదు.. దాని వల్ల రాంగ్రూట్లో వచ్చి.. చనిపోతున్నారు. ఇవన్నీ కేంద్రమంత్రితో చర్చించాం. దీనిపై కేంద్రమంత్రి గడ్కరీ స్పందించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ మే మొదటి వారంలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. సమస్యను పరిష్కరిస్తున్నందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు..
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ
సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు...
1.హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లు, ఎక్స్‌ప్రెస్ హైవేగా విస్తరించడం