Vijayasai Reddy in Rajya Sabha: ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల అంశంపై రాజ్యసభ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి గళమెత్తారు. ఆర్టికల్ 154 ప్రకారం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని అన్నారు. రాజధానిపై పూర్తి అధికారం రాష్ట్రానిదేనన్నారు. ప్రాంతాల మధ్య అంతరాలు తొలగించేందుకే 3 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించామని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒక దగ్గర ఉంటే.. హైకోర్టు మరో ప్రాంతంలో ఉందని గుర్తు చేశారు. అదే విధంగా వైజాగ్ మెట్రో వ్యవహారంలో కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు.
ఇవీ చదంవడి: