మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు భాజపాలో ఉన్న ఆయన గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో మహారాష్ట్ర గవర్నర్గా వెళ్లారు. గత నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగిసింది. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి సోమవారం రానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో విద్యాసాగర్ రావు భాజపా సభ్యత్వం తీసుకోనున్నారు.
మళ్లీ రాజకీయాల్లోకి విద్యాసాగర్ రావు - bjp
మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఇవాళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు.
మళ్లీ రాజకీయాల్లోకి విద్యాసాగర్ రావు