తెలంగాణ

telangana

ETV Bharat / state

8నెలలగా వేతనాలు ఇవ్వడం లేదు

రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న విద్యావాలంటీర్లకు 8 నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వడం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్​రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్​లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్​రెడ్డికి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు.

8నెలలగా వేతనాలు ఇవ్వడం లేదు

By

Published : Sep 7, 2019, 8:37 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 16 వేల విద్యావాలంటీర్లకు 8 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటుందని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్​లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్​రెడ్డికి ఈ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. 2017లో టీఆర్టీ పరీక్షలో ఎస్జీటీలుగా ఎంపికైన వారి నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న వారి వేతనాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

8నెలలగా వేతనాలు ఇవ్వడం లేదు

ABOUT THE AUTHOR

...view details