తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏఐసీసీ కార్యదర్శి పదవికి వీహెచ్ రాజీనామా - HANUNMANTHARAO

తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి ముఖ్య కారణం... పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు కాకుండా ప్యారాచూట్‌ నేతలకు టికెట్లు ఇవ్వడేమనని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ కార్యదర్శి పదవికి తాను రాజీనామా చేసినట్లు తెలిపారు.

ఏఐసీసీ కార్యదర్శి పదవికి వీహెచ్ రాజీనామా

By

Published : Jun 29, 2019, 8:06 PM IST

ఏఐసీసీ కార్యదర్శి పదవికి వి.హనుమంతరావు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు పంపించినట్లు వీహెచ్‌ వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ ఒక్కరే బాధ్యత తీసుకోవద్దన్నారు. సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలకు బాధ్యత ఉంటుందని అయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్యారాచూట్‌ నేతలకు టికెట్లు ఇచ్చినందునే తెలంగాణలో పార్టీ ఓటమికి ఒక కారణమన్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిలో ఉంటేనే భవిష్కత్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక నుంచైనా పార్టీ సినీయర్ నేతలకు కూడా సమయం కేటాయించి పార్టీ అభివృద్దిపై వారి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు.

ఏఐసీసీ కార్యదర్శి పదవికి వీహెచ్ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details