కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలను సైబరాబాద్ అదనపు డీసీపీ తార పరిశీలించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ వాహనదారులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
కూకట్పల్లిలో సైబరాబాద్ అదనపు డీసీపీ ఆకస్మిక తనిఖీలు - వాహనదారులు
ప్రభుత్వాలు పదేపదే చెప్తున్నా.. రోడ్లపైకి వస్తోన్న వాహనదారుల కట్టడికి కూకట్పల్లి చెక్పోస్ట్ వద్ద సైబరాబాద్ అడిషనల్ డీసీపీ తార ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్వీయ జాగ్రత్తలు పాటించాలని.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు ఆమె సూచించారు.
కూకట్పల్లిలో సైబరాబాద్ అదనపు డీసీపీ ఆకస్మిక తనిఖీలు
కరోనా వైరస్ మహమ్మారిని తరిమేయాలంటే ఎవరు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని తెలిపారు. ఈ సోదాల్లో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. స్వీయ జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించాలని ప్రజలు ఆమె సూచించారు.
ఇవీ చూడండి:'యువతకు కరోనా రాదనుకుంటే పొరపాటే'