ఒకటి కొంటే ఒకటి ఉచితం.. మరి లేదు..
సూపర్ మార్కెట్లలో ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ ఆఫర్లు ఉండేవి. ఇప్పుడవేవీ కనిపించడం లేదు. కవరు పైనే ఎమ్మార్పీ ధరలు ఉండబట్టి దానిని పెంచడానికి వీలు పడలేదు కాని.. లేకుంటే వాటి ధరలు కూడా పెంచేసేవారని సత్యనారాయణ అనే వినియోగదారుడు పేర్కొన్నారు. కూరగాయల ధరలు నిన్నటికి ఈ రోజుకు రెట్టింపు అయ్యాయని కావాలనే కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుకోవాలని చూస్తున్నారన్నారు. బుధవారం ఉదయం 6 గంటలకే దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. రైతుబజార్లు కూడా ఇదే సమయాన్ని పాటించాయి. నిన్న రాత్రి వరకూ ఎంతో హడావిడిగా సరకులు కొన్న నగరవాసులు.. బుధవారం కాస్త ప్రశాంతంగానే సూపర్ మార్కెట్లకు వచ్చి కొనుగోలు చేశారు. ఆయా దుకాణాలకు స్టాకును కూడా ఉదయం 10 గంటల లోపే నిర్వాహకులు తెచ్చారు.
రూపాయలలో ఇలా.. కూరగాయ రైతుబజారు రిటైల్
కిలో | కూరగాయలు | రూ.. | రిటైల్ ధర |
1 | టమాటా | 10 | 15-20 |
1 | నల్ల వంకాయ | 15 | 20-30 |
1 | బెండకాయ | 18 | 25-35 |
1 | పచ్చి మిర్చి | 23 | 35-40 |
1 | బీరకాయలు | 33 | 40-45 |
1 | క్యారెట్ | 25 | 35-40 |
1 | దొండకాయ | 18 | 25-30 |
1 | బీన్స్ | 70 | 90-95 |
1 | ఉల్లిగడ్డలు | 19 | 25-30 |