లాక్‌డౌన్ కారణంగా నగరంలోని అన్ని హెటళ్లు మూతపడ్డాయి. దీంతో అన్నం కోసం అందరు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థతి భారత సైనికులకూ వచ్చింది. నగరానికి చెందిన వీబీజీ ఫౌండేషన్ సంస్థ నిర్వహకులు రాజు భారత సైనికులు కష్టాలు తెలుసుకొని వారికి భోజనం అందించారు.
సైన్యానికి భోజనం అందించిన వీబీజీ ఫౌండేషన్ - వీబీజీ ఫౌండేషన్ వార్తలు
దేశ సరిహద్దుల్లో మన కోసం పని చేసే సైనికులకు ఏం ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేం. కాని వారికి తన వంతుగా భోజనం అందించి ఆదర్శంగా నిలిచారు వీబీజీ ఫౌండేషన్ నిర్వహకులు రాజు. లాక్డౌన్తో హోటళ్లు మూయటంతో ఇబ్బంది పడ్డ సైనికులకు ఆహారం అందించారు.
సైన్యానానికి భోజనం అందించిన వీబీజీ ఫౌండేషన్
భారత సైనికులు ముంబయి నుంచి హైదరాబాద్ మీదుగా బెంగుళూరుకు వెళ్తున్నారు. మధ్యాహ్న సమయంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఆగారు. ఆహరం కోసం పరిసర ప్రాంతాల్లో చూశారు. అన్ని హెటళ్లు మూయటంతో నిరాశకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రాజు దాదాపు 40 మంది భారత సైనికులకు భోజనం అందించారు. లాక్డౌన్లో సైన్యానికి భోజనం సమకూర్చిన రాజుకు ఆర్మీ అధికారి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!
Last Updated : May 26, 2021, 7:24 PM IST