రైతు సంక్షేమానికి బడ్జెట్లో తెరాస ప్రభుత్వం పెద్దపీట వేసిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవికమైనదని ఇది ఎవ్వరినీ మభ్యపెట్టే విధంగా లేదన్నారు. ఓ వైపు ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాల అమలులో తెరాస ప్రభుత్వం వెనక్కితగ్గడం లేదన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో రాష్ట్ర సర్కారు కట్టుబడి ఉందన్నారు. సంపద పెంచాలి... పేదలకు పంచాలన్న పట్టుదలతో తామంతా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్ర బడ్జెట్ వాస్తవికమైనది: ఆరూరి రమేశ్ - 'రాష్ట్రబడ్జెట్ వాస్తవికమైనది'
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవికమైనది వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగుతోంది.
'రాష్ట్రబడ్జెట్ వాస్తవికమైనది'