తెలంగాణ

telangana

ETV Bharat / state

వరవరరావును వెంటనే విడుదల చేయాలి: ప్రజాసంఘాల నేతలు - వరవరరావు

ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న వరవరరావును అరెస్ట్​ చేయడం సరైంది కాదని ప్రజాసంఘనేతలు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని బెయిల్​పై వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

వరవరరావును వెంటనే విడుదల చేయాలి: ప్రజాసంఘ నేతలు

By

Published : Mar 26, 2019, 3:26 PM IST

వరవరరావును వెంటనే విడుదల చేయాలి: ప్రజాసంఘ నేతలు
ప్రజాస్వామిక వాదులను అరెస్ట్​ చేయడమంటే... ప్రజల గొంతు నొక్కడమేనని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. గత 5 దశాబ్దాలుగా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వరవరరావును పుణె పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్​ చేయడం సరైంది కాదని వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విడుదల చేయాలని ప్రజాసంఘ నేతలు డిమాండ్​ చేశారు. వరవరరావును వెంటనే విడుదల చేయాలని ఆయన సతీమణి హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగలేఖ రాశారు.

ABOUT THE AUTHOR

...view details