తెలంగాణ

telangana

ETV Bharat / state

vaccination: రేపటి నుంచి ఎన్​పీడీసీఎల్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్​ - తెలంగాణ వార్తలు

రేపటి నుంచి ఎన్​పీడీసీఎల్ 16 సర్కిళ్ల పరిధిలోని ఉద్యోగులకు కరోనా టీకా(vaccination) ఇస్తారని ఎన్​పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాలరావు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.

vaccination: రేపటి నుంచి ఎన్​పీడీసీఎల్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్​
vaccination: రేపటి నుంచి ఎన్​పీడీసీఎల్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్​

By

Published : Jun 13, 2021, 5:49 PM IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్​పీడీసీఎల్ 16 సర్కిళ్ల పరిధిలోని విద్యుత్ ఉద్యోగులు, ఓ అండ్ ఎం స్టాఫ్, ఆర్టిజన్స్, ఆన్ మ్యాన్డ్ వర్కర్స్, స్పాట్ బిల్లర్స్, ప్రైవేట్ కలెక్షన్ ఏజెంట్స్, స్టోర్ లేబర్ అందరికి రేపటి నుంచి టీకాలు(vaccination) ఇవ్వనున్నట్లు ఎన్​పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాలరావు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి ఉపయోగించుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా నిరంతరం శ్రమిస్తున్న విద్యుత్ ఉద్యోగులకు టీకాలు ఇవ్వడానికి అంగీకరించి ఆదేశాలు జారీచేసిన సీఎం కేసీఆర్​కు, ట్రాన్స్కో- జెన్​కో సీఎండీ డి.ప్రభాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి:L.RAMANA: సైకిల్‌ దిగి కారెక్కనున్న ఎల్‌.రమణ... రేపు వెల్లడించే అవకాశం

ABOUT THE AUTHOR

...view details