సీఎం కేసీఆర్ రాజనీతి ప్రకారం నడుచుకోవడంలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహాం ముందు ఆందోళనలో పాల్గొన్నారు. ఉపసభాపతి ఎన్నికలో కాంగ్రెస్ హుందాగా వ్యవహరించిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలను ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన సభ్యులపైఅనర్హత వేటు వేయాలని ఉత్తమ్ కోరారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
రాజనీతి ఏది?
అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఎం రాజనీతి ప్రకారం నడుచుకోవడంలేదని విమర్శించారు.
మాట్లాడుతున్న ఉత్తమ్