తెలంగాణ రాష్ట్రంలో తెరాస, భాజపాలు కలిసి నాటకం ఆడుతున్నాయని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఎప్పటి నుంచో తాము ఆరోపిస్తున్నా పట్టించుకోలేదని...ఇప్పుడు భాజపా కూడా అదే అంశాన్ని తెరపైకి తెస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గత ఐదేళ్లు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి
గాంధీ భవన్ నుంచి పార్టీ కార్యకర్తలతో ఫేస్బుక్ ద్వారా మాట్లాడిన ఉత్తమ్ కేసీఆర్ సర్కారుపై మండి పడ్డారు. నూతన మున్సిపల్ చట్టం లోపభూయిష్టంగా తయారు చేశారని, స్వయంగా గవర్నరే దానిని తిప్పి పంపారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు, వార్డుల వారీగా విభజన చేసి మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్ద శక్తిగా ఎదిగే అవకాశం లేదని, గత లోకసభ ఎన్నికల్లో అదృష్టం కొద్దీ నాలుగు స్థానాలు గెలుచుకుందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సీబీఐచే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి