రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మే నెల నుంచి పూర్తి వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని యుూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ నెల పూర్తి జీతంతో పాటు మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర కార్యాలయం వద్ద నాయకులు నిరసన నిర్వహించారు.
మే నెల పూర్తి జీతమివ్వండి: యూటీఎఫ్ - యూటీఎఫ్
రాష్ట్ర ఆదాయ పరిస్థితులు మెరుగుపడినందున ఉద్యోగులకు మే నెలలో పూర్తి వేతనాలు, 2 నెలలుగా కోత విధించిన జీతమంతా చెల్లించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడాలని విన్నవించారు.
మే నెల పూర్తి జీతమివ్వండి: యూటీఎఫ్
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగు పడినందున వేతనాల్లో కోతలను ఉపసంహరించకపోవటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.