ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మహిళల హాస్టల్‌లో ప్రవేశించి విద్యార్థినులను కత్తితో బెదిరించి చరవాణులను దొంగలించి పరారైన వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15వ తేదీ తెల్లవారు జామున వసతి గృహంలో చొరబడి తమను బెదిరించాడని... అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థినులు ఉస్మానియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఓయూలో విద్యార్థినులను బెదిరించిన దొంగ అరెస్ట్ - ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా వసతి గృహంలో చొరబడి విద్యార్థినులను కత్తితో బెదిరించి చరవాణులను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉస్మానియాలో చరవాణుల దొంగ దొరికాడు!!