ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల శ్రీనివాస్ హైదరాబాద్ ఎల్బీనగర్, నాగోల్లో పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్యులకు, వలస కార్మికులకు సుమారు 5 క్వింటాళ్ల బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో బత్తాయి రైతులను ఆదుకోవాలని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉప్పల శ్రీనివాస్ వెల్లడించారు.
ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బత్తాయి పండ్ల పంపిణీ
హైదరాబాద్ ఎల్బీనగర్, నాగోల్లో ఉప్పల పౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్యులకు, వలసకూలీలకు బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. బత్తాయి రైతులను ఆదుకోవడంతో పాటు కరోనా కట్టడి కోసం బత్తాయి పండ్లను పంపిణీ చేస్తున్నట్లు ఉప్పల పౌండేషన్ వ్యవస్థాపకులు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు.
బత్తాయి రైతులను ఆదుకోవడంతో పాటు కరోనా కట్టడి కోసం బత్తాయి పండ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉప్పల పౌండేషన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంపిణీ కొనసాగుతున్నట్లు తెలిపారు. దీనితో పాటు వలస కార్మికులకు, నిరుపేదలకు రెండు వేల మందికి బిర్యానీ పొట్లాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ ఉన్నంతకాలం ఏదో రూపంగా పేద ప్రజలను ఆదుకుంటామని ఉప్పల పౌండేషన్ వ్యవస్థాపకులు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు