తెలంగాణ

telangana

ETV Bharat / state

Thefts in Hyderabad : జూబ్లీహిల్స్​ వ్యాపారి ఇంట్లో చోరీ.. పోలీసులకు అనేక అనుమానాలు - Jubilee Hills Thefts case update

Jubilee Hills Thefts case update : మారణాయుధాలతో బెదిరించి హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో వ్యాపారి ఇంట్లో డబ్బులు చోరీ చేసిన ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు గంటలు ఇంట్లోనే ఉన్న అగంతకుడు పుల్​గా మద్యం తాగి కేవలం డబ్బులు మాత్రమే తీసుకెళ్లాడు. ఆరు గంటలు వేరే వాళ్లతో ఫోన్​లో చాటింగ్​​ చేశాడు. చివరకి వ్యాపారి కుమార్తె ఫోన్​ నుంచే క్యాబ్​ బుక్​ చేసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఉదయం షాపింగ్​ చేశాడు. ఇలా అంశాలు పోలీసు దర్యాప్తులో గుర్తించగా.. నిందితుడు వెళ్లగానే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

theft
theft

By

Published : May 14, 2023, 11:57 AM IST

Jubilee Hills Thefts case update : హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 52లోని వ్యాపారి ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు ఇంట్లో గురువారం రాత్రి జరిగిన దొంగతనం కేసులో పోలీసులకు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సుమారు రాత్రి 2.40 గంటలకు ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు వ్యాపారి కుమార్తె, గర్భిణి అయిన నవ్య మెడపై కత్తిపెట్టి బెదిరించాడు. సుమారు ఆరు గంటలు అక్కడే ఉన్నాడు. ఇళ్లంతా కలియతిరిగాడు. ఇంట్లో ఉన్న మద్యం బాటిల్​ తీసుకొని పుల్​గా తాగాడు.

అప్పటికే వాళ్లు ఒంటిపై ఉన్న బంగారం, నగలు తీసుకొని వదిలేయండి అన్నట్లు సమాచారం. అయినా వాటిని నిరాకరించిన అంగతకుడు డబ్బులు మాత్రమే కోరాడు. ఉదయం తెల్లవారు జాము వరకు అతడు ఫోన్​ నుంచి వేరే వాళ్లకి మెసేజ్​లు చేశాడు. అనంతరం సుమారు రూ. 10లక్షలు తీసుకొని నవ్య ఫోన్​ నుంచే క్యాబ్​ బుక్​ చేసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. అయితే నిందితుడు వెళ్లగానే యాజమాని ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అందరిలా కాదు ఈ దొంగ చాలా డిఫరెంట్ ​: ఏ దొంగ అయినా చోరి అనంతరం ఎవరికి పట్టుపడకుండా పారిపోవాలని చూస్తాడు. పోలీసులకు చిక్కకుండా, ఆధారాలు లభించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు దొంగతనం చేసిన ఈ అగంతకుడు మాత్రం బాధితులతో చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. అతనిది నాందేడ్​ అని రోడ్డు ప్రమాదంలో భార్య పిల్లలు చనిపోయినట్లు ఆ ఇంట్లో వాళ్లకు చెప్పాడు. తనకు డబ్బు చాలా అవసరమని బంగారు అభరణాలు వద్దని నవ్యతో చెప్పినట్లు సమాచారం.

నవ్య ఉద్యోగం వివరాలు, కుటుంబ పరిస్థితులు, ఆమె సోదరి, నాలుగేళ్ల కుమార్తె గురించి కూడా వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. 'మీ ఇంట్లో అన్ని విషయాలు నాకు తెలుసని' నవ్యతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దొంగతనం చేసిన వ్యక్తి వ్యాపారి వివరాలు ఎలా తెలుసుకున్నాడు. బాధితుడు వద్ద ఇది వరకే పని చేశాడా అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

క్యాబ్​లో వెళ్లి.. షాపింగ్​లో బిజీ : దొంగతనానికి ఇంటిని ఎంచుకున్న నిందితుడు ముందుగా రెక్కీ నిర్వహించి రాత్రి 10 గంటలకే ఇంటి వెనుక భాగంలో వాటర్​ పైపులు పట్టుకొని ఇంటి ప్రాంగణంలోకి వెళ్లాడు. ఇంట్లో పనిచేసే పని మనిషి నిందితుడుని గుర్తించినా.. యజమాని బంధువుల డ్రైవర్​గా భావించి దాని గురించి పెద్దగా ఆరా తీయలేదు. చోరీ అనంతరం నిందితుడు క్యాబ్​లో షాద్​నగర్​ వెళ్లి అక్కడ వస్త్ర దుకాణంలో కొత్త కోటు ధరించి అక్కడే మధ్యాహ్నం సమయం వరకు షాపింగ్​ చేసినట్లు సీసీ కెమెరాలు పరిశీలించగా తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పశ్చిమ మండల క్రైం విభాగం, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details