వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే అలా ఉండటానికి కారణం ఏమిటనేది సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. అదేమంటే- వ్యాయామం చేసేటప్పుడు మోట్స్-సి అనే హార్మోన్ విడుదలవుతుందనే విషయాన్ని కొన్నేళ్ల క్రితమే గుర్తించారు. అయితే అది ఎందుకనేది అప్పట్లో తెలియలేదు. పైగా ఈ హార్మోన్ జన్యుసమాచారం శరీరంలోని ఇతర జన్యువులకన్నా భిన్నంగా ఉందనీ, వయసురీత్యా పనితీరు తగ్గిన మైటోకాండ్రియా కణాల పనితీరుని ఇది మెరుగుపరుస్తుందనీ తాజాగా గుర్తించారు.
వ్యాయామం చేశాక ఈ హార్మోన్ 12 శాతం పెరిగిందట! - వ్యాయామం వెనుక కారణాలు
వ్యాయామం చేస్తే శారీరకంగా దృఢంగా ఉంటామని అందరికీ తెలిసిందే. అయితే అలా ఉండటానికి కారణాలు ఏమిటనేది ఎవరికీ సరిగా తెలియదు. వ్యాయామం చేసే సమయంలో శరీరంలో జరిగే మార్పులేంటనేది సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. అవేంటో చూద్దాం..
ఇందుకోసం వీళ్లు రోజూ వ్యాయామం చేసేవాళ్లను ఎంపికచేసి వ్యాయామానికి ముందూ తరవాత వాళ్ల శరీరంలో ఈ హార్మోన్ శాతాన్ని లెక్కించారట. వ్యాయామానికి ముందుకన్నా తరవాత ఈ హార్మోన్ శాతం 12 శాతం పెరిగిందట. ఈ విషయాన్ని నిర్ధరించేందుకు ఎలుకలకు ఈ హార్మోన్‌ను ఇంజెక్టు చేయగా వృద్ధ దశలో ఉన్న ఎలుకలు సైతం చక్కగా ట్రెడ్‌మిల్ చేయడమే కాదు, బాగా నడవడం ప్రారంభించాయట. దీన్నిబట్టి వ్యాయామం చేసేవాళ్లు వృద్ధాప్యంలోనూ ఫిట్‌గా ఉండటానికి కారణం ఈ హార్మోన్ విడుదల కావడమే అని భావిస్తున్నారు.
ఇదీ చదవండి:అడవుల జిల్లాకు రైల్వే భరోసా ఏది?