కేంద్రంలో భాజపా (BJP) ప్రభుత్వం ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ సిటీ కార్యాలయంలో రక్త శిబిరాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రారంభించారు. కేంద్రం ఉచితంగా రేషన్ పంపించినా.. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పార్టీ తరఫున ప్రజలకు సేవా కార్యక్రమలు చేస్తున్నామన్నారు.
Kishan Reddy: 'కేంద్రం ఇచ్చిన ఉచిత రేషన్ ఇప్పటికీ పంపిణీ చేయలేదు' - Telangana news
కేంద్రం ఉచితంగా రేషన్ పంపించినా.. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. బ్లాక్ ఫంగస్ నివారణకు కావాల్సిన మెడిసిన్ రాష్ట్రనికి అందిచామని వెల్లడించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో రక్త శిబిరాన్ని ప్రారంభించారు.
కరోనా కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్ నివారణకు కావాల్సిన మెడిసిన్ రాష్ట్రనికి అందిచామని ఆయన వెల్లడించారు. కొవిడ్ వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఎప్రిల్, మే నెలలకు గాను ఒక్కో కుటుంబానికి 5 కిలోల రేషన్ రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. దురదృష్టవశాత్తు ఇప్పటికీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.