తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల ఏకగ్రీవంలో కారు జోరు.. - మున్సిపోల్స్​

పురపాలక పోరులో అధికార పార్టీ తెరాస విజయం ఏకపక్షమైంది. 80 వార్డుల్లో 77 స్థానాలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. మూడింటిని ఎంఐఎం దక్కించుకుంది.

మున్సిపల్​ ఎన్నికల ఏకగ్రీవంలో కారు జోరు..
మున్సిపల్​ ఎన్నికల ఏకగ్రీవంలో కారు జోరు..

By

Published : Jan 15, 2020, 5:21 AM IST

Updated : Jan 15, 2020, 7:32 AM IST

మున్సిపల్​ ఎన్నికల ఏకగ్రీవంలో కారు జోరు..
పురపాలక పోరులో తెరాస విజయం ఏకపక్షమైంది. ఏకగ్రీవాల్లో మూడు మినహా అన్ని స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. రాష్ట్రంలో 80 వార్డులు ఏకగ్రీవం కాగా ఇందులో తెరాస 77 సొంతం చేసుకుంది. ఎంఐఎం మూడు స్థానాలను దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బుజ్జగింపులు.. సముదాయింపులు.. నచ్చ జెప్పడం.. భవిష్యత్తు అవకాశాలను ఆశగా చూపి తిరుగుబాటు అభ్యర్థులను విరమింప జేసేందుకు తెరాస, కాంగ్రెస్, భాజపా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అసంతృప్తులను బుజ్జగించేందుకు తీవ్రంగా శ్రమించారు. పోటాపోటీ ఉన్న చోట్ల స్వతంత్రులతోనూ నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం పలు చోట్ల అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

13, 036 మంది పోటీలో..

రాష్ట్రంలో ఈనెల 22న ఎన్నికలు జరిగే 120 పురపాలక సంఘాలు, 9 నగరపాలక సంస్థల బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. ఉపసంహరణ తర్వాత మొత్తం 3052 వార్డులకు 13 వేల 36 మంది పోటీలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా వరంగల్‌లో 809, నిజామాబాద్‌- 1141, నల్గొండ 1724, కరీంనగర్‌లో 1926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహబూబ్‌నగర్‌- 1412, రంగారెడ్డి- 2953, ఆదిలాబాద్‌-1304, ఖమ్మం- 500, మెదక్‌లో1267 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

79 వార్డులు ఏకగ్రీవం:

పురపాలక సంఘాల్లోని 2727 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా... వాటిలో 79 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కార్పోరేషన్లలో 325 డివిజన్లకుగాను.. 324 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పోరేషన్‌లో ఒక డివిజన్​ను తెరాస ఏకగీవ్రంగా దక్కించుకుంది. పరకాలలో 22 వార్డులు ఉండగా 11 వార్డుల్లో... అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నూరులో 7, సత్తుపల్లిలో 6 వార్డులు తెరాస ఖాతాలో చేరాయి. మేడ్చల్‌లో 5, రంగారెడ్డిజిల్లాలో 3, సిరిసిల్లలో 4 చోట్ల గులాబీ పార్టీ అభ్యర్థులు.. ఏకపక్ష విజయం సాధించారు. పార్టీ అభ్యర్థిత్వాల కోసం ప్రయత్నం చేసి బీ-ఫాం దక్కకపోవడం వల్ల పలువురు స్వంతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఒకే పార్టీలో ఉన్నా వర్గ విభేదాలతో కొందరు ఇతర పార్టీల తరఫున బరిలో దిగారు.

నిరసనలు, కంటతడులు..

ఆలంపూర్, కొల్లాపూర్‌లో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పలువురు అభ్యర్థులు.. బరిలో దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందు పురపాలక సంఘంలో ఎమ్మెల్యే బానోతు హరిప్రియ.. 24 వార్డులకు తెరాస అభ్యర్థులను బరిలోదింపగా.. తన వర్గానికి టికెట్లు దక్కలేంటూ మడత వెంకటగౌడ్ 24 చోట్ల అభ్యర్థులను పోటీకి నిలిపారు. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ, తెదేపా, సీపీఎం కూటమిగా ఏర్పడి బరిలో దింపాయి. పార్టీ అభ్యర్థిత్వత్వం దక్కలేదని పలుచోట్ల పార్టీల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కొన్నిచోట్ల కంటతడి పెట్టుకోగా.. మరికొన్ని చోట్ల నేతల ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

Last Updated : Jan 15, 2020, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details